Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ఇదే

  • స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ
  • సొంత బ్యానర్ తో నిర్మాతగాను రంగంలోకి
  • విభిన్నమైన కాన్సెప్టుతో తొలి ప్రయత్నం

చిత్రపరిశ్రమలో హీరోలుగా ఎదిగిన తరువాత .. కొంత మొత్తం వెనకేసుకున్న తరువాత .. కొంతమంది హీరోలు నిర్మాతలుగా మారడం జరిగింది. కానీ విజయ్ దేవరకొండ ఈ విషయంలోను తనదైన దూకుడు చూపించాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చాలా తక్కువ కాలంలోనే ఆయన నిర్మాతగా మారిపోయాడు. 'కింగ్ ఆఫ్ ది హిల్' బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, ఒక సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. హీరో .. హీరోయిన్ అని కాకుండా, ప్రధాన పాత్రల కలయికగా కనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. 'మీకు మాత్రమే చెప్తా' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News