Triber: ఇన్నోవా, ఎర్టిగాలకు సరికొత్త పోటీ... 'ట్రైబర్' ను తీసుకువచ్చిన రేనాల్ట్

  • మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కొత్త కారు
  • పొడవైన ఛాసిస్ తో వస్తున్న 'ట్రైబర్'
  • ధర రూ.4.95 లక్షలు

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రేనాల్ట్ తన వాహనశ్రేణిలో సరికొత్త కారును తీసుకువస్తోంది. భారత వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా పొడవైన ఛాసిస్ తో ఉండే 'ట్రైబర్' ను మార్కెట్లో విడుదల చేసింది. 4 మీటర్ల పొడవుండే 'ట్రైబర్' సెవెన్ సీటర్ వెహికిల్. అవసరాన్ని బట్టి చివరి వరుస సీట్లను తొలగించి డిక్కీ నిడివిని మరింత పెంచుకోవచ్చు. 'ట్రైబర్' లో 5 స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వినియోగదారుల అభిరుచి ప్రకారం తమకు నచ్చిన వెర్షన్ ఎంచుకోవచ్చు.

రియర్ పార్కింగ్ సెన్సర్లు, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సాంకేతిక పరిజ్ఞానం పొందుపరిచారు. పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్న ఈ కారు ధర బేసిక్ మోడల్ (ఆర్ఎక్స్ఈ) కు రూ.4.95 లక్షలుగా నిర్ణయించారు. వీటిలోనే మరికొన్ని అడ్వాన్స్ డ్ మోడళ్ల ధరలు రూ.6.49 లక్షల వరకు పలుకుతున్నాయి. 'ట్రైబర్' ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఏర్పాటు చేసిన 'ఈజీఫిక్స్' అనే విధానం ద్వారా కారు కాబిన్ ను మన అవసరాలకు తగిన విధంగా 100 రకాలుగా మార్చుకునే సౌలభ్యం కల్పించారు.

కాగా, ఈ కారు టయోటా ఇన్నోవా, మారుతి ఎర్టిగాలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ధర విషయంలో ఇది ఇన్నోవా, ఎర్టిగాల కంటే చవకగా లభిస్తూనే, వాటి స్థాయిలో ఫీచర్లను కలిగివుంది. ఇన్నోవా ఎంట్రీ లెవల్ మోడల్ ధర రూ,14 లక్షల పైచిలుకు ఉండగా, ఎర్టిగా బేసిక్ మోడల్ రూ.7.4 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో రేనాల్ట్ నుంచి వస్తున్న 'ట్రైబర్' మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మార్కెట్ ను వశం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News