Nagarjuna: నాకు వచ్చింది జ్వరం మాత్రమే: హీరో నాగార్జున

  • నాగ్ కి అనారోగ్యమంటూ ప్రచారం 
  • 'మన్మథుడు 2' కోసం చేసిన కసరత్తులే కారణమనే టాక్ 
  • ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన నాగ్  

  తనకి జ్వరం తప్ప మరెలాంటి ఆరోగ్య సమస్య లేదనీ, ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన సన్నిహితులతో ఫ్యాన్ గ్రూపులో షేర్ చేయించారు. నాగార్జున ఈ విధంగా చేయడం వెనుక ఒక బలమైన కారణమే వుంది. నాగార్జున కథానాయకుడిగా ఇటీవల 'మన్మథుడు 2' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో యంగ్ లుక్ తో కనిపించడం కోసం నాగార్జున గట్టి కసరత్తులు చేశారు. ఈ వయసులో ఆయన ఎక్కువగా కసరత్తులు చేయడం వలన, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారనే టాక్ నిన్నంతా ఫిల్మ్ నగర్లో షికారు చేసింది. కీళ్ల నొప్పులతో చాలా బాధపడుతున్నారనే వార్త కూడా కొన్ని వెబ్ సైట్స్ లో జోరందుకుంది. ఈ ప్రచారం అంతకంతకూ పుంజుకుంటూ ఉండటంతో, స్వయంగా నాగార్జునే రంగంలోకి దిగిపోయి, తనకి జ్వరం తప్ప ఎలాంటి అనారోగ్య సమస్య లేదంటూ స్పష్టం చేయవలసి వచ్చింది.

  • Loading...

More Telugu News