Nagaland: గుంతలో ఇరుక్కున్న వాహనాన్ని ఎత్తి అవతలపడేసిన మహిళా జవాన్లు... వీడియో వైరల్

  • బురద గుంతలో చిక్కుకుపోయిన మహీంద్రా బొలేరో వాహనం
  • గట్టి పట్టుబట్టిన మహిళా జవాన్లు
  • వీడియోను ట్వీట్ చేసిన నాగాలండ్ ఎమ్మెల్యే

శారీరకంగా మహిళలు పురుషులతో సమానం కాలేరు అన్న వ్యాఖ్యలు తప్పు అని నాగాలాండ్ మహిళా బెటాలియన్ జవాన్లు నిరూపించారు. నాగా కొండప్రాంతాల్లో తరచుగా పడే వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంటాయి. ఈ క్రమంలో ఓ మార్గంలో వర్షం కారణంగా ఏర్పడిన గుంతలో మహీంద్రా బోలెరో వాహనం చిక్కుకుంది. అదే సమయంలో ఆ మార్గంలో నాగా మహిళా బెటాలియన్ బృందాలు వెళుతున్నాయి. వారిలో ఓ బృందం గుంతలో ఇరుక్కున్న వాహనాన్ని చూసి వెంటనే స్పందించారు. బస్సు దిగి వచ్చి తమ సత్తా ఏంటో చూపించారు.

బురదలో కూరుకుపోయి కదిలేందుకు మొరాయిస్తున్న ఆ భారీ వాహనాన్ని అవలీలగా ఎత్తి ఇవతలికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాగాలాండ్ శాసనసభ్యుడు మహోన్లునో కికాన్ దీన్ని ట్వీట్ చేయగా, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. నాగా మహిళా బెటాలియన్ తో పెట్టుకుంటే అంతే సంగతులు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. వారి శక్తి ఏంటో తెలిసింది అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News