Lakshmi Parvathi: రాజధానిని దొనకొండకు మార్చుతున్నారని ఎవరు చెప్పారు?: లక్ష్మీపార్వతి

  • విశాఖపట్నంలో లక్ష్మీపార్వతి మీడియా సమావేశం
  • రాజధాని మార్చుతున్నట్టు సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని వివరణ
  • రైతుల దృష్టి మరల్చేందుకే టీడీపీ ప్రచారం మొదలుపెట్టిందని ఆరోపణలు

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ మహిళానేత లక్ష్మీపార్వతి మండిపడ్డారు. రాజధానిని మార్చుతామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని, రైతుల దృష్టి మరల్చేందుకే తెలుగుదేశం పార్టీ ఈ విధమైన ప్రచారం మొదలుపెట్టిందని ఆరోపించారు. విశాఖపట్నంలో ఆమె పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధానిని దొనకొండకు మార్చుతున్నట్టు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

దొనకొండలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, నారా లోకేశే అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని లక్ష్మీపార్వతి ఆరోపణలు చేశారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తున్నామంటూ చెప్పినా వారిని రాజధాని ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు.

Lakshmi Parvathi
Donakonda
Andhra Pradesh
Amaravathi
  • Loading...

More Telugu News