Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు, ప్రజలు నష్టపోయారు: బీజేపీ నేత సుజనా చౌదరి

  • కొల్లూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
  • వరదనీటిని సరైన సమయంలో వదలాల్సింది
  • ప్రభుత్వం తరపున రైతులను ఎవరూ ఆదుకోలేదు

కేవలం ఏపీ ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు, ప్రజలు నష్టపోయారని బీజేపీ నేత సుజనా చౌదరి విమర్శించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు సుజనా చౌదరి, సునీల్ దేవ్ ధర్ ఈరోజు పర్యటించారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త వహించి వరదనీటిని సరైన సమయంలో వదిలి ఉంటే నష్టం జరిగేది కాదని అన్నారు. ప్రభుత్వం తరపున ఇంత వరకూ ఎవరూ ఆదుకోలేదని రైతులు చెబుతున్నారని, రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
bjp
Sujana Chowdary
  • Loading...

More Telugu News