Somireddy: తనపై కేసు నమోదవడం పట్ల సోమిరెడ్డి స్పందన

  • భూవివాదంలో సోమిరెడ్డిపై కేసు నమోదు
  • కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును కప్పిపుచ్చి ప్రయివేటు కేసు పెట్టారంటూ సోమిరెడ్డి ఆరోపణ
  • తప్పుడు కేసులకు భయపడేది లేదంటూ ధీమా

టీడీపీ అగ్రనేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఓ భూవివాదానికి సంబంధించి నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై సోమిరెడ్డి స్పందించారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రాగానే తనను టార్గెట్ చేసుకుంటారని ఊహించానని, తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును దాచి, ఇప్పుడు అదే అంశంలో ప్రయివేటు కేసు పెట్టారని సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. కోట్ల విలువ చేసే నా భూములే అమ్ముకున్నాను తప్ప ఓ పల్లెటూళ్లోని 2.83 ఎకరాల స్థలం కోసం ఫోర్జరీకి పాల్పడే స్థాయికి దిగజారలేదని వ్యాఖ్యానించారు. తనకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని, ఎవరిది తప్పో కోర్టులే తేలుస్తాయని అన్నారు.

Somireddy
Venkatachalam
Nellore District
Telugudesam
  • Loading...

More Telugu News