Rahul Gandhi: రాహుల్ గాంధీ రాజకీయాలు గందరగోళంగా వున్నాయి: పాకిస్థాన్ మంత్రి తీవ్ర విమర్శలు
- రాహుల్ రాజకీయాలు అయోమయం
- వాస్తవాలకు దగ్గరగా వుండండి
- మీ ముత్తాత నెహ్రూలా నిటారుగా నిలబడండి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పాకిస్థాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని... ఇందులో జోక్యం చేసుకునేందుకు పాకిస్థాన్ సహా మరే ఇతర దేశానికి తావు లేదన్న రాహుల్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. రాహుల్ రాజకీయాలు అమోమయంగా ఉన్నాయని చెప్పారు. రాహుల్ రాజకీయాలలో ఉన్న పెద్ద సమస్య గందరగోళమే అని ఎద్దేవా చేశారు. వాస్తవాలకు దగ్గరగా ఉండాలని రాహుల్ కు సూచించారు. మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూలా నిటారుగా నిలబడాలని సూచన చేశారు.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా సమర్థిస్తుండడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో, భారత్ పై అక్కసును వెళ్లగక్కుతోంది.