Jagan: జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: కన్నా లక్ష్మీనారాయణ

  • రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని జగన్ కు బహిరంగ లేఖ రాశా
  • నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు
  • రాజధానిపై నెలకొన్న గందరగోళ పరిస్థితులకు కూడా ముగింపు పలకాలి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని ప్రాంత రైతులు తమకు ప్రభుత్వం కౌలు చెల్లించడం లేదంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారని... తనను కలసి ఆవేదనను వ్యక్తం చేశారని... ఆ సందర్భంలో జగన్ కు తాను బహిరంగ లేఖ రాశానని చెప్పారు. తన లేఖపై స్పందిస్తూ రూ. 187.40 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఇదే విధంగా, రాజధానిపై అమరావతి రైతుల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను కూడా తొలగించాలని, ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.

Jagan
YSRCP
Kanna
BJP
Amaravathi
Farmers
  • Loading...

More Telugu News