Sharwanand: శర్వానంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

  • 'రణరంగం'తో పరాజయం 
  • కొత్త దర్శకుడితో సినిమా మొదలు 
  • నాయికగా రీతూ వర్మ   

'రణరంగం' సినిమాతో ఇటీవలే శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. దాంతో శర్వానంద్ మరో ప్రాజెక్టును ఓకే చేసి సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ చాలా త్వరగానే ఆయన తన తదుపరి ప్రాజెక్టును సెట్ చేసుకుని సెట్స్ పైకి వచ్చేశాడు.

ఈ రోజున చెన్నైలో ఈ సినిమా షూటింగు లాంచనంగా మొదలైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. శర్వానంద్ జోడీగా రీతూ వర్మ కనిపించనుంది. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ - ప్రియదర్శి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Sharwanand
Ritu Varma
vennela Kishore
Priyadarshi
  • Loading...

More Telugu News