Narendra Modi: నా నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు: ఆమిర్ ఖాన్‌కు మోదీ ట్విట్టర్ సందేశం
- ప్లాస్టిక్ నిషేధానికి పిలుపునిచ్చిన ప్రధాని
- అక్టోబర్ 2 నుంచి శ్రీకారం చుడదామని పిలుపు
- దీనికి ట్విట్టర్లో మద్దతు తెలిపిన బాలీవుడ్ హీరో
ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన నిర్ణయాన్ని సమర్ధించినందుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిలిపి వేయాలని, ఈ సత్సంకల్పానికి అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల తన ఆల్ ఇండియా రేడియో ప్రసంగం మన్ కీ బాత్‌లో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. ' మీ నిర్ణయం చాలా గొప్పది. దాన్ని స్వాగతిస్తున్నా. ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తాం' అని ఆమిర్ ఖాన్ ట్విటర్ ద్వారా మోదీకి మద్దతు తెలిపారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ ట్వీట్ చేశారు.