Chiranjeevi: చిరంజీవి మనుమరాలు అన్నప్రాసనలో పవన్ భార్య సందడి!

  • శ్రీజ, కల్యాణ్ దేవ్ కుమార్తె నవిష్క
  • స్వీట్ బాక్స్ ఇచ్చి ముద్దు చేసిన అన్నా లెజినోవా
  • దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించిన చిరు దంపతులు

చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతుల కుమార్తె నవిష్క అన్న ప్రాసన ఇటీవల జరుగగా, ఈ వేడుకలో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా స్వయంగా పాల్గొని సందడి చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను యూ-ట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో అదిప్పుడు వైరల్ అయింది. బంధుమిత్రులు, సన్నిహితులు తరలిరాగా, ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

పవన్‌ కల్యాణ్‌ భార్య అన్నా లెజినోవా తన బిడ్డ మార్క్‌ శంకర్‌ తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెజినోవా, నవిష్కకు స్వీట్‌ బాక్స్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక చిరంజీవి దంపతుల ఆనందానికి అవధుల్లేవు. దగ్గరుండి మనుమరాలికి అన్న ప్రాసన చేయించారు. ఈ వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News