sahoo: 'సాహో' టికెట్ రూ. 300 అట... ఏపీ హైకోర్టు నోటీసులు!

  • శుక్రవారం విడుదల కానున్న 'సాహో'
  • టికెట్ రేట్ల పెంపుపై కోర్టును ఆశ్రయించిన నట్టి కుమార్
  • దిల్ రాజు సహా పలువురికి నోటీసులు

ప్రభాస్‌ హీరోగా నిర్మితమైన 'సాహో', ఈ శుక్రవారం నాడు విడుదల కానుండగా, అదనపు షోలను, టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ సర్కారు అనుమతించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత నట్టి కుమార్, హైకోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి జీ శ్యామ్ ప్రసాద్, చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు జారీ చేశారు. సినిమా టికెట్లను దారుణంగా పెంచేశారని, రూ. 300 వరకూ నిర్ణయించారని, వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని నట్టి కుమార్ పిటిషన్ వేశారు.

దీనిపై వివరణ ఇవ్వాలంటూ హోమ్ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, విశాఖ పోలీసు కమిషనర్‌, 'సాహో' చిత్ర పంపిణీదారు దిల్‌ రాజు తదితరులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణ నేడు కొనసాగనుంది.

sahoo
Ticket
Andhra Pradesh
High Court
Notice
  • Loading...

More Telugu News