Chandrababu: విజయసాయిరెడ్డి ట్వీట్లపై స్పందించి నా స్థాయిని దిగజార్చుకోలేను: సుజనా చౌదరి ఘాటు కౌంటర్

  • ఆ ట్వీట్లేవో ప్రజల బాగు కోసం చేస్తే బాగుంటుంది
  • విజయసాయి నాకు పాతికేళ్లుగా తెలుసు
  • బీజేపీపై చంద్రబాబు గతంలో విష ప్రచారం చేశారు

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్వీట్లపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఘాటుగా స్పందించారు. ఆయన ట్వీట్లపై స్పందించి తన స్థాయిని దిగజార్చుకోవాలనుకోవడం లేదన్నారు. ఆ ట్వీట్లను వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు. విజయసాయిరెడ్డి తనకు పాతికేళ్లుగా తెలుసన్న సుజనా చౌదరి.. ఆయన తనను విమర్శించడం మాని, ప్రజల బాగు కోసం ట్వీట్లు చేస్తే బాగుంటుందని అన్నారు.

టీడీపీ, కాంగ్రెస్‌లపైనా సుజనా చౌదరి విరుచుకుపడ్డారు. బీజేపీపై చంద్రబాబు గతంలో విష ప్రచారం చేశారన్నారు. ప్రాంతీయ పార్టీలు ఇక బతికి బట్ట కట్టడం అసాధ్యమని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు-వైఎస్ మధ్య పోరు నడిచిందని సుజన గుర్తు చేశారు. ఇక, నాయకుడు ఎవరో తేల్చుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. చట్ట ప్రకారం ఏపీకి రావాల్సిన వాటిని కేంద్రం ఇస్తోందని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Chandrababu
Sujana Chowdary
Vijay Sai Reddy
BJP
  • Loading...

More Telugu News