Somireddy: కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడానికే సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారు: సోమిరెడ్డి

  • జగన్ పై సోమిరెడ్డి విమర్శలు  
  • గత ప్రభుత్వ హయాంలో మొదలైన పనులు కొనసాగకూడదని జగన్ నిర్ణయించుకున్నట్టుందని ఆరోపణలు  
  • రాజధాని మార్పు ఆలోచన విరమించుకోవాలని హితవు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. తరచూ ఢిల్లీ పర్యటనలకు వెళుతున్న సీఎం జగన్ కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు. పరిపాలనలో సమస్యలు రావడం సహజమని, వాటిని ఎదుర్కొనే ప్రయత్నాలు చేయకుండా, జగన్ మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్ వైఖరి చూస్తుంటే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఏ ఒక్క పని కూడా ముందుకు కదలకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.

సీఎం జగన్ రైతుల ఆందోళన చూసిన తర్వాతైనా రాజధాని మార్పుపై పునరాలోచన చేయాలని హితవు పలికారు. పోలవరం విషయంలోనూ జగన్ స్పష్టమైన వైఖరి ప్రదర్శించాలని, పోలవరం అథారిటీ సూచనలకు అనుగుణంగా నడుచుకోవడమా, లేక ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించడమా అనేది నిర్ణయించుకోవాలని తెలిపారు.

Somireddy
Jagan
Andhra Pradesh
Delhi
  • Loading...

More Telugu News