Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఇద్దరిని కాల్చి చంపిన టెర్రరిస్టులు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి హింసాకాండ

  • కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
  • ఇద్దరు గుజ్జర్ యువకులను కిడ్నాప్ చేసి, హతమార్చిన వైనం
  • ఉగ్రవాద గ్రూపును మట్టుబెడతామన్న రాష్ట్ర డీజీపీ

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇద్దరు గుజ్జర్ యువకులను నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం నిన్న రాత్రి 7.30 గంటలకు పుల్వామా జిల్లా థోక్ ప్రాంతంలోని తాత్కాలిక శిబిరం నుంచి అబ్దుల్ ఖదీర్ (రాజౌరీ జిల్లా వాసి), మన్సూర్ అహ్మద్ (శ్రీనగర్ వాసి)లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో, వారి కోసం భద్రతాబలగాలు గాలింపు చర్యలను చేపట్టాయి. ఈ క్రమంలో పుల్వామా జిల్లా అటవీ ప్రాంతంలో బుల్లెట్లతో ఛిద్రమైన వీరిద్దరి మృత దేహాలు లభ్యమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో జరిగిన తొలి ఉగ్రవాద హింసాకాండ ఇదే. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర డీజీపీ దిల్ బాల్ సింగ్ మాట్లాడుతూ, గుజ్జర్ యువకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాద గ్రూపును మట్టుబెడతామని చెప్పారు.

Jammu And Kashmir
Pulwama
Terrorists
Gujjar Youth
  • Loading...

More Telugu News