Kala Venkatarao: రాజధాని రైతుల కష్టాలు చూసి వైసీపీ నేతలు ఎంతో ఆనందిస్తున్నారు: కళా వెంకట్రావు

  • 35 వేల ఎకరాలు త్యాగం చేసిన రాజధాని రైతులను అవమానిస్తున్నారంటూ మండిపాటు
  • రాజధాని విషయంలో సీఎం ఎందుకు మాట్లాడడంలేదంటూ ప్రశ్నించిన కళా వెంకట్రావు
  • శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

వైసీపీ సర్కారుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి కోసం 35,000 ఎకరాలను త్యాగం చేసిన రైతులను ఈ ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోందని మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని రైతులు కష్టాలు పడుతుంటే వైసీపీ నేతలకు ఎంతో ఆనందంగా ఉందని విమర్శించారు. రాజధాని విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడిన సమయంలో సీఎం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

వైసీపీ మూడు నెలల పాటు పరిపాలిస్తే రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి మళ్లిందని కళా వెంకట్రావు విమర్శించారు. ప్రజలకు మేలు చేసే ప్రతి దాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేస్తోందని, వైసీపీ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

Kala Venkatarao
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News