Avanthi Srinivas: త్వరలోనే అమరావతిపై ప్రకటన చేస్తాం: మంత్రి అవంతి

  • అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది జగన్ ఆలోచన
  • వరదల వల్ల భవానీ ఐలాండ్ కు రూ. 2 కోట్ల నష్టం వాటిల్లింది
  • భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న ప్రకటనలతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. బొత్స చేసిన వ్యాఖ్యలు ఓ వైపు ప్రకంపనలు సృష్టిస్తుండగానే... వివాదానికి మరింత ఆజ్యం పోశారు మరో మంత్రి అవంతి శ్రీనివాస్. అమరావతిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది ముఖ్యమంత్రి జగన్ ఆలోచన అని తెలిపారు. విజయవాడలోని భవానీ ఐలాండ్ ను నేడు అవంతి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, వరదల వల్ల భవానీ ఐలాండ్ కు రూ. 2 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. భవిష్యత్తులో ఐలాండ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు.

Avanthi Srinivas
YSRCP
Jagan
Amaravathi
  • Loading...

More Telugu News