Crime News: సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ : రూ.3 కోట్ల సొత్తు అపహరణ

  • బంగారం, వజ్రాలు, నగదు ఉన్నట్లు సమాచారం
  • హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లో ఘటన
  • ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన సొత్తును అపహరించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు-2లో ఉత్తమ్ రెడ్డి ఉంటున్నారు. సోమవారం రాత్రి ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో ఎవరూలేని సమయంలో చోరీ జరిగింది.  ఇవాళ ఉదయం తిరిగి వచ్చిన తర్వాత ఉత్తమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు చూసుకోగా విలువైన వజ్రాల నగలు, నగదు మాయం అయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దాదాపు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలతోపాటు రూ.కోటి నగదు తస్కరించినట్లు సమాచారం.  సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. ఉత్తమ్ రెడ్డి నివాసం ఉంటున్న కాలనీ పరిసర ప్రాంతాల్లోనీ సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న ఇంట్లో భారీ చోరీ జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Crime News
bunjarahills
theft
subbaramireddy
2 cr property
  • Loading...

More Telugu News