Arun Jaitly: అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లిన మోదీ

  • విదేశీ పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ
  • జైట్లీ కుటుంబసభ్యులను ఓదార్చిన ప్రధాని
  • మోదీ వెంట అమిత్ షా

భారత ప్రధాని మోదీ మూడు దేశాల (యూఏఈ, బహ్రెయిన్, ఫ్రాన్స్) పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. రాజధానికి చేరుకున్న గంటల వ్యవధిలోనే ఈ ఉదయం ఆయన దివంగత అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లారు. జైట్లీ కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు.

మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే అరుణ్ జైట్లీ కన్నుమూశారు. వెంటనే ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మోదీ మాట్లాడారు. అయితే, విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని రావద్దని, పర్యటనను పూర్తి చేయాలని ఆ సందర్భంగా మోదీని జైట్లీ కుటుంబసభ్యులు కోరినట్టు వార్తలు వచ్చాయి. ఆదివారం జైట్లీ అంత్యక్రియలను నిర్వహించారు.

Arun Jaitly
Modi
Amit Shah
BJP
  • Loading...

More Telugu News