TTD: టీటీడీ ట్రెజరీ నుంచి కిరీటం, ఉంగరాలు మాయం!

  • 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయం
  • ఆభరణాల విలువను ఏఈవో నుంచి రాబట్టిన వైనం
  • ఏకపక్షంగా ఏఈవోపై చర్య తీసుకోవడంపై వెల్లువెత్తుతున్న నిరసనలు

టీటీడీలో మరోసారి కలకలం చెలరేగింది. ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయమయ్యాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి టీటీడీ ఏఈవో శ్రీనివాసులుపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతని జీతం నుంచి రాబట్టారు.

మరోవైపు శ్రీనివాసులుపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు కారకులు ఎవరే విషయాన్ని నిర్ధారించుకోకుండానే శ్రీనివాసులు నుంచి రికవరీ చేయడాన్ని తప్పుబడుతున్నారు.

TTD
Treasury
Theft
  • Loading...

More Telugu News