US Open: యూఎస్ ఓపెన్ లో రోజర్ ఫెదరర్ కు చెమటలు పట్టించిన భారత యువ కెరటం సుమిత్ నాగల్!
- యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ పోటీలు
- ఫెదరర్ తో ఆడిన సుమిత్ నాగల్
- తొలి సెట్ లో విజయం
- ఆపై సత్తా చాటి రెండో రౌండ్ కు స్విస్ స్టార్
గడచిన 25 సంవత్సరాల వ్యవధిలో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు తొలిసారిగా అర్హత సాధించిన భారత యువకెరటం సుమిత్ నాగల్, తొలి రౌండ్ పోటీల్లో వరల్డ్ స్టార్ రోజర్ ఫెదరర్ కు ముచ్చెమటలు పట్టించాడు. తొలి సెట్ ను 4-6 తేడాతో సునాయాసంగా గెలిచి, ఫెదరర్ కు షాకిస్థాడా? అన్నట్టు కనిపించాడు. ఆపై తేరుకున్న ఫెదరర్ వరుస సెట్లలో 6-1, 6-2, 6-4 తేడాతో సుమిత్ ను ఓడించి, రెండో రౌండ్ లో అడుగు పెట్టి, ఊపిరి పీల్చుకున్నాడు.
కాగా, 2015లో వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న నాగల్, బ్రెజిల్ కు చెందిన జావో మెనేజస్ ను 5-7, 6-4, 6-3 తేడాతో క్వాలిఫయర్ పోటీలో ఓడించి, యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఈ సంవత్సరం యూఎస్ ఓపెన్ తో నాగల్ తో పాటు ప్రజనేశ్ గుణేశ్వరన్ కూడా ఆడుతున్నాడు.