Aishwarya Rajesh: కమలహాసన్ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే: ఐశ్వర్య రాజేశ్

  • 'భారతీయుడు 2' సినిమా నుంచి ఆఫర్ 
  • ఇతర సినిమాలతో బిజీ కావడంతో తప్పుకున్న వైనం
  • పరస్పర అంగీకారంతో తప్పుకున్నానన్న ఐశ్వర్య

ఐశ్యర్య రాజేశ్... కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న యువ హీరోయిన్. తాజాగా తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాలో కూడా మెరిసింది. ఈమెకు కమలహాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'భారతీయుడు 2' సినిమాలో ఆఫర్ వచ్చింది. భారీ చిత్రంలో ఆఫర్ రావడంతో ఆనందంగా ఒప్పుకుంది. అయితే, ఆ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో... ఇతర సినిమాలతో ఐశ్వర్య బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో, కమల్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. దీంతో, పరస్పర అంగీకారంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు వెల్లడించింది.

Aishwarya Rajesh
Kamal Haasan
Shankar
Bharatiyudu 2
  • Loading...

More Telugu News