PV Sindhu: భారతీయురాలిని అయినందుకు గర్వంగా వుంది.. ఢిల్లీలో పీవీ సింధు

  • ఒకుహరాపై డబ్ల్యూబీసీలో ఘన విజయం
  • గత రాత్రి ఇండియాకు వచ్చిన తెలుగుతేజం
  • నేటి మధ్యాహ్నం హైదరాబాద్ కు

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో ఒకుహరాపై ఘన విజయం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు, అర్థరాత్రి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. ఆమె రాక గురించి అప్పటికే సమాచారాన్ని అందుకున్న మీడియా, చుట్టుముట్టగా, "ఓ భారతీయురాలిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇదో గొప్ప మెడల్. నాకు ప్రతి క్షణమూ సహకరించిన కోచ్ కి కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించింది.

కాగా, ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో గెలిచి, వరల్డ్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుని తొలి భారతీయురాలిగా సింధూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక సింధూ, ఈ మధ్యాహ్నం హైదరాబాద్ కు రానుండగా, ఆమెకు రాష్ట్ర బ్యాడ్మింటన్ ఫెడరేషన్ తో పాటు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

PV Sindhu
WBC
Gold Medal
New Delhi
  • Error fetching data: Network response was not ok

More Telugu News