Vijayawada: విజయవాడలో విద్యార్థినిని వీడియో తీసి బెదిరింపులు!

  • విజయవాడలో బీబీఏ చదువుతున్న జగదీశ్
  • పరిచయమైన అమ్మాయి నగ్న దృశ్యాల సేకరణ
  • ఆపై బ్లాక్ మెయిల్ చేసిన వైనం

అమ్మాయిలను ప్రేమ ముగ్గులోకి దించి, ఆపై ఆ చనువుతో వారి నగ్న దృశ్యాలను చిత్రీకరించి, కోరిక తీర్చాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ విద్యార్థి ఆగడాలు వెలుగులోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. నిందితుడిని కాపాడేందుకు రాజకీయ నాయకులు రంగంలోకి దిగినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే, సూర్యారావుపేటకు చెందిన గడ్డం జగదీశ్‌ విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీబీఏ చదువుతున్నాడు. కాలేజీల వద్ద మకాం వేసి, తనకు పరిచయమయ్యే అమ్మాయిలకు ప్రేమ పాఠాలు చెప్పి, వారిని ట్రాప్ చేయడం ఇతని దినచర్య. ఈ క్రమంలో తన వలలో పడిన ఓ అమ్మాయితో వీడియో కాల్ లో మాట్లాడుతూ, నగ్న వీడియోలు, ఫొటోలు చిత్రీకరించాడు.

ఆపై వాటిని తన స్నేహితులకు షేర్ చేసి, అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. కోరిక తీర్చాలన్న అతని వేధింపులను భరించలేని విద్యార్థిని, తల్లిదండ్రులతో కలిసి వచ్చి, పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావుని ఆశ్రయించింది. ఆపై కేసును విచారించగా, జగదీశ్ బారిన పడిన మరికొందరు బాధితులు కేసు పెట్టారు.

 ఈ విషయం తెలుసుకున్న జగదీశ్‌ పరారు కాగా, నిన్న సాయంత్రం అతన్ని అరెస్ట్ చేశారు. కాగా, జగదీశ్‌ చాలా మంచివాడని ఓ ఎంపీతో పాటు, తెలంగాణకు చెందిన మంత్రి ఒకరు రంగంలోకి దిగి, పోలీసు ఉన్నతాధికారులతో మంతనాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది.

Vijayawada
Harrasment
Nude Seanes
Video
College Student
  • Loading...

More Telugu News