Telangana: తెలంగాణలో ఏపీ టాస్క్ ఫోర్స్ దాడులు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d48f8d3f4b25792bc8de2705a3a8122a57e51bef.jpg)
- తిరుమల అడవుల నుంచి ఎర్రచందనం దుంగలు
- అక్రమంగా తెచ్చి నిల్వచేసిన శేషయ్య అనే వ్యక్తి
- స్థానిక పోలీసుల సాయంతో దాడులు
తిరుమల అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను తెచ్చి అక్రమంగా నిల్వ ఉంచారన్న ఆరోపణలపై తెలంగాణలో, ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం, ఎన్మన్ బెట్ల గ్రామంలోని శేషయ్య అనే వ్యక్తి ఇంటిలో ఎర్రచందనం దుంగలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుసుకున్న ఏపీ టాస్క్ ఫోర్స్, తెలంగాణ పోలీసుల సహకారంతో ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో శేషయ్య ఇంటిలో 100కు పైగా దుంగలు పట్టుబడ్డాయి. దీంతో ఆ ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు. శేషయ్యను కోర్టులో హాజరుపరిచి, పీటీ వారెంట్ పై ఏపీకి తరలించి, కేసును లోతుగా విచారిస్తామని అన్నారు.