Microsoft: మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్.... చిన్న లోపాన్ని గుర్తించినా లక్షల్లో ప్రైజ్ మనీ
- ఎడ్జ్ బ్రౌజర్ కు కొత్త రూపు తెచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు
- బగ్స్ కనిపెట్టండి అంటూ ప్రకటన
- రూ.21 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామంటూ వెల్లడి
సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొంతకాలం కిందట ఎడ్జ్ పేరిట ఇంటర్నెట్ బ్రౌజర్ ను తీసుకురావాలని సంకల్పించింది. అయితే, గూగుల్, ఫైర్ ఫాక్స్ ల ముందు ఎడ్జ్ క్రోమియం బ్రౌజర్ నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో, ఎడ్జ్ ను లోపరహితంగా మలిచి, ఇంటర్నెట్ రంగంలో తన స్థాయి నిరూపించుకోవాలని మైక్రోసాఫ్ట్ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో, ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎడ్జ్ బ్రౌజర్ లో బగ్స్ (లోపాలు) ఉన్నట్టు గుర్తిస్తే వారికి రూ.21 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని వెల్లడించింది. ఎడ్జ్ బ్రౌజర్ సాఫ్ట్ వేర్ బీటా వెర్షన్ (అభివృద్ధి దశలో ఉన్న వెర్షన్) ను కొందరు వినియోగదారులకు అందిస్తారు. వారు ఆ వెర్షన్ ను ఉపయోగించి అందులో ఏవైనా ప్రమాదకర లోపాలు ఉన్నాయేమో గుర్తించాలి.