TG Venkatesh: 'ఏపీకి నాలుగు రాజధానులు' వ్యాఖ్యలపై టీజీకి కౌంటర్ ఇచ్చిన సొంత పార్టీ నేత

  • ఏపీకి నాలుగు రాజధానులంటూ సంచలనం రేపిన టీజీ వెంకటేశ్
  • ఆ వ్యాఖ్యలు టీజీ వ్యక్తిగతమన్న బీజేపీ నేత రఘురాం
  • ఏపీకి అమరావతినే రాజధానిగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందంటూ వెల్లడి

ఏపీకి నాలుగు రాజధానులు అంటూ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా, బీజేపీ నేత రఘురాం స్పందిస్తూ, టీజీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, టీజీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ వైఖరిగా భావించనవసరం లేదని స్పష్టం చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని, గతంలో ప్రధాని మోదీ కూడా రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం నిధులు కేటాయించారని రఘురాం గుర్తు చేశారు. అయితే, గత ప్రభుత్వం ఆ నిధులను సక్రమంగా ఉపయోగించలేదని, ప్రస్తుతం అధికారం చేపట్టిన జగన్ సర్కారు ఆ నిధుల విషయంలో అవకతవకలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి వాస్తవాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.

TG Venkatesh
Raghuram
BJP
Andhra Pradesh
Amaravathi
  • Loading...

More Telugu News