Sadhvi Pragya Thakur: బీజేపీ సీనియర్ నేతల మరణాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్

  • కొన్ని రోజుల వ్యవధిలో మరణించిన సుష్మ, అరుణ్ జైట్లీ
  • చేతబడి చేయించారంటున్న సాధ్వీ
  • తనకు మహరాజ్ జీ చెప్పారంటూ వ్యాఖ్యలు

ఇటీవల కొన్నిరోజుల వ్యవధిలో బీజేపీ సీనియర్ నేతలు సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదాస్పద ఎంపీ, మధ్యప్రదేశ్ బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేతబడి చేయిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు తనకు మహరాజ్ జీ అనే ఆధ్మాత్మికవేత్త చెప్పారని సాధ్వీ తెలిపారు. బీజేపీపై ప్రత్యర్థులు క్షుద్రపూజలు చేయిస్తున్నారని మహరాజ్ జీ చెప్పింది నిజమే అనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు బీజేపీకి దుర్దశ నడుస్తోందన్న భావన కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Sadhvi Pragya Thakur
BJP
Arun Jaitly
Sushma Swaraj
  • Loading...

More Telugu News