YSRCP: వైసీపీ నేతలు అమరావతిని మార్చే ప్రయత్నం మానుకోవాలి: సీపీఐ రామకృష్ణ హితవు

  • ప్రజల్లో రాజధానిపై గందరగోళం నెలకొందన్న రామకృష్ణ
  • ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్
  • బొత్స వ్యాఖ్యలపై జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన వామపక్ష నేత

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఏపీలో అయోమయం నెలకొందని, ప్రజలు రాజధాని విషయంలో గందరగోళంలో ఉన్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రజల్లో అనుమాన నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజధాని విషయంలో స్పష్టతనివ్వాలని, తమ వైఖరేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని రామకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ నేతలు అమరావతిని మార్చే ప్రయత్నం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

YSRCP
CPI
Ramakrishna
Jagan
Amaravathi
  • Loading...

More Telugu News