Chandrababu: గూగుల్ లో సెర్చ్ చేస్తే కోడెల, ఆయన దూడల పేర్లు కనిపిస్తున్నాయి: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు రహస్యాలు కోడెల గుప్పిట్లో ఉన్నాయంటూ ట్వీట్
  • టీడీపీ అధినాయకత్వంపై విజయసాయి ధ్వజం
  • కోడెల కుటుంబీకులను పచ్చ పార్టీ రక్షిస్తోందంటూ వ్యాఖ్యలు

వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినాయకత్వంపై విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు రహస్యాలు మాజీ స్పీకర్ కోడెల గుప్పెట్లో ఉన్నాయని, అందుకే కోడెల ఎన్ని నేరాలకు పాల్పడినా చంద్రబాబు ఖండించడంలేదని తెలిపారు. కోడెల, ఆయన కుటుంబ సభ్యుల గురించి రోజుకో కేసు తెరపైకి వస్తున్నా, పచ్చ పార్టీ వారిని కాపాడుతోందని ఆరోపించారు. స్పీకర్ గా పనిచేసిన వారిలో అత్యంత హీనమైన చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరని గూగుల్ లో వెదికితే కోడెల, ఆయన దూడల పేర్లు ప్రత్యక్షమవుతున్నాయంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం, కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Chandrababu
Telugudesam
Kodela
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News