Jagan: రాజధానిపై తెర వెనుక లాలూచీ ఏంటో జగన్ బయటపెట్టాలి: పంచుమర్తి అనురాధ

  • వరద నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం అమరావతి అంశాన్ని తెరపైకి తెచ్చిందన్న అనురాధ
  • మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నా జగన్ స్పందించడంలేదని ఆరోపణ
  • రాజధాని అమరావతిపై సీఎం జగన్ ప్రకటన చేయాలంటూ డిమాండ్

ఏపీ తాజా పరిణామాలపై టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ స్పందించారు. రాజధాని అమరావతిపై తెర వెనుక లాలూచీ ఏంటో జగన్ బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు. వరద నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం అమరావతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు.  అమరావతిపై మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా జగన్ ఎందుకు స్పందించడంలేదని అనురాధ ప్రశ్నించారు. తక్షణమే రాజధానిపై జగన్ ప్రకటన చేయాలని అన్నారు.

విజయవాడ-గుంటూరు ప్రాంతాల మధ్య రాజధానికే ఎక్కువమంది మొగ్గు చూపిన విషయం శివరామకృష్ణన్ కమిటీలో ఉందన్న సంగతి బొత్స గ్రహించాలని ఆమె హితవు పలికారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇప్పుడు రోడ్లపై తిప్పుతున్నారని మండిపడ్డారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కూడా సీఎం వరదలపై సమీక్ష నిర్వహించకపోవడం దారుణమని విమర్శించారు.

Jagan
Panchumarthi Anuradha
Telugudesam
Amaravathi
  • Loading...

More Telugu News