Polavaram: పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- రీటెండరింగ్ ద్వారానే పోలవరం పనులను పూర్తి చేస్తాం
- త్వరలోనే టెండర్లను ఖరారు చేస్తాం
- రూ. 60 వేల కోట్లతో ప్రతి ఇంటికి నీటినిచ్చే ప్రాజెక్టును చేపట్టబోతున్నాం
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రీటెండరింగ్ ద్వారానే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పారు. త్వరలోనే టెండర్లను ఖరారు చేస్తామని తెలిపారు. వచ్చే నెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చే ప్రాజెక్టును చేపట్టబోతున్నామని... రూ. 60 వేల కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రూ. 30 వేల కోట్ల సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు.