Nara Lokesh: తన పెళ్లిరోజు సందర్భంగా వినూత్నంగా ట్వీట్ చేసిన నారా లోకేశ్

  • 2007 ఆగస్టు 26న లోకేశ్, బ్రాహ్మణి వివాహం
  • తమ వైవాహిక జీవితానికి 12 ఏళ్లు అంటూ లోకేశ్ ట్వీట్
  • ప్రతి క్షణం నీ ప్రేమలోనే అంటూ భావోద్వేగభరిత స్పందన

టీడీపీ యువనేత నారా లోకేశ్ తన పెళ్లిరోజు సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. నారా బ్రాహ్మణితో తన దాంపత్యజీవితానికి 12 ఏళ్లు అంటూ ట్వీట్ చేశారు. "12 సంవత్సరాలు, 144 నెలలు, 4,383 రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు, 37,86,91,200 సెకన్లు. ప్రతి క్షణం నీ ప్రేమలోనే. ఇన్నేళ్ల కాలంలో నిన్ను నేను ప్రేమించకుండా ఉన్న క్షణం అంటూ లేదు. హ్యాపీ యానివర్సరీ బ్రాహ్మణి" అంటూ తన భావుకతను ప్రదర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్, నందమూరి బాలకృష్ణ తనయ బ్రాహ్మణిల వివాహం 2007 ఆగస్టు 26న జరిగిన సంగతి తెలిసిందే.

Nara Lokesh
Brahmani
Chandrababu
Balakrishna
  • Error fetching data: Network response was not ok

More Telugu News