Nayanatara: నయనతార హీరోయిన్ గా ఆమె ప్రియుడి కొత్త చిత్రం

  • దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో నయనతార
  • నయన్ హీరోయిన్ గా శివన్ నిర్మాతగా కొత్త చిత్రం
  • వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం

తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో అగ్ర సినీ నటి నయనతార ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో శివన్ దర్శకత్వంలో నయన్ 'నేనూ రౌడీనే' అనే చిత్రాన్ని చేసింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. నయనతార హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి శివన్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. 'అవళ్' ఫేమ్ మిళింద్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందట. టాలీవుడ్ విషయానికి వస్తే, 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించింది.

Nayanatara
Vignesh Sivan
New Film
Kollywood
Tollywood
  • Loading...

More Telugu News