womens commission chairperson: ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ... పార్టీ ప్రతినిధుల సమక్షంలో బాధ్యతల స్వీకారం

  • తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో కార్యక్రమం
  • హాజరైన స్పీకర్‌ తమ్మినేని
  • భారీగా హాజరైన మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైసీపీ సీనియర్‌ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి స్పీకర్‌ తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీకి చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అన్న నినాదాన్ని మాటలకు పరిమితం చేయకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం అవకాశాలు కల్పిస్తూ వారికి సముచిత గౌరవం ఇస్తున్నారని ప్రశంసించారు.

womens commission chairperson
vasireddy padma
sworn
  • Loading...

More Telugu News