Akhil: పరశురామ్ దర్శకత్వంలో అఖిల్ మూవీ?

  • 'గీత గోవిందం'తో హిట్ కొట్టిన పరశురామ్ 
  • మహేశ్ బాబుతో సినిమా మరింత ఆలస్యం 
  • అఖిల్ నెక్స్ట్ మూవీ చేసే అవకాశం

'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ ను ఇచ్చిన పరశురామ్, ఇంతవరకూ తన తదుపరి సినిమాను సెట్ చేసుకోలేకపోయాడు. తన దగ్గర కథ రెడీగా ఉన్నప్పటికీ .. తన వైపు నుంచి ప్రయత్న లోపం లేకపోయినప్పటికీ, తదుపరి ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. మహేశ్ బాబుతో ఒక సినిమా ఓకే అయిందిగానీ, ఆయన వంశీ పైడిపల్లితో సినిమాను పూర్తి చేసిన తరువాత గాని ఈ సినిమా సెట్స్ పైకి రాడు.

ఈ లోగా మరో హీరోతో మరో స్క్రిప్ట్ ను చేసే ఆలోచనలో పరశురామ్ వున్నాడట. ఆ కథ కూడా రెడీగా ఉండటంతో ఆయన నాగార్జునకి వినిపించాడనేది తాజా సమాచారం. కథా పరంగా కాస్త పెద్ద బడ్జెట్ అయ్యేలా ఉన్నప్పటికీ, నిర్మాతగా ఈ ప్రాజెక్టు చేయడానికి నాగార్జున సుముఖంగా వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అఖిల్ హీరోగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.

Akhil
Parashuram
  • Loading...

More Telugu News