amaravathi: రాజధానిపై టీజీ వ్యాఖ్యలతో మరిన్ని అనుమానాలు : మాజీ మంత్రి పుల్లారావు

  • ప్రభుత్వం తన వైఖరిని విస్పష్టంగా ప్రకటించాలి
  • ప్రజల్ని అయోమయానికి గురిచేయడం సరికాదు
  • మంత్రుల వ్యాఖ్యలపై మండిపాటు

నవ్యాంధ్ర రాజధాని మార్పుపై ప్రజల్లో పలు అనుమానాలు నెలకొంటున్నాయని, ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ నాలుగు ప్రాంతాల్లో రాజధాని అన్న వ్యాఖ్య అనంతరం మరింత అయోమయం నెలకొందని, ఈ నేపథ్యంలో రాజధాని అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్‌ చేశారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌతంరెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన పుల్లారావు ఈ విషయంలో విస్పష్ట ప్రకటన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనన్నారు. ప్రజల్ని అయోమయానికి గురిచేయడం ప్రభుత్వానికి మంచిది కాదని సూచించారు.

amaravathi
ex.minister pullarao
tg venkatesh
  • Loading...

More Telugu News