Tirumala: తిరుమలలో అన్యమత ప్రచారం... తొలి వేటు పడింది!

  • భక్తులకు ఇచ్చిన టికెట్ల వెనుక అన్యమత ప్రచారం
  • నెల్లూరు జోన్ స్టోర్స్ కంట్రోలర్ నిర్లక్ష్యం
  • జగదీశ్ బాబుపై సస్పెన్షన్ వేటు

తిరుమలలో భక్తులకు ఇచ్చిన బస్సు టికెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటన ఉండటాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన వైఎస్ జగన్ సర్కారు, ఓ అధికారిపై వేటు వేసింది. నెల్లూరు జోన్‌ లో స్టోర్స్‌ కంట్రోలర్‌ గా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ బాబుపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

టికెట్ల రోల్స్‌ ను పంపిణీ చేయడంలో జగదీశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలినందునే ఈ చర్యలు తీసుకున్నామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు వెల్లడించారు. జగదీశ్ అనాలోచిత నిర్ణయం కారణంగా వేలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ ప్రతిష్టకు సైతం భంగం వాటిల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Tirumala
Bus Tickets
Suspenssion
Nellore District
Stores Manager
  • Loading...

More Telugu News