PV Sindhu: నీ ప్రతిభ ముందు ఆకాశం కూడా చిన్నబోతుంది తల్లీ!: సింధు విజయంపై చంద్రబాబు వ్యాఖ్యలు

  • వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన సింధు
  • ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ గా ఘనత
  • ఓ భారత షట్లర్ ఈ ఘనత సాధించడం పట్ల గర్విస్తున్నామంటూ చంద్రబాబు ట్వీట్

తెలుగమ్మాయి పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిష్ విజేతగా అవతరించి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. నూతన వరల్డ్ చాంపియన్ కు హృదయపూర్వక శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన తొలి భారత షట్లర్ గా రికార్డు పుటల్లోకెక్కినందుకు గర్విస్తున్నాం అంటూ హర్షం వ్యక్తం చేశారు. "ఎవరి ప్రతిభనైనా పొగిడేందుకు ఆకాశమే హద్దు అంటారు, కానీ నీ ప్రతిభకు ఆకాశం కూడా హద్దు కాదు తల్లీ" అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అంతేకాకుండా, తాము ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటామని, సింధుకు అప్పట్లోనే గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చి గౌరవించామని చంద్రబాబు గుర్తు చేశారు.

PV Sindhu
Chandrababu
BWF
  • Error fetching data: Network response was not ok

More Telugu News