BJP: ఆసుపత్రిపాలైన మరో బీజేపీ సీనియర్ నేత... మురళీమనోహర్ జోషికి అస్వస్థత

  • కాన్పూర్ లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నేత
  • ఆందోళనలో పార్టీ శ్రేణులు
  • కొన్నిరోజుల వ్యవధిలో కన్నుమూసిన సుష్మ, జైట్లీ

బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆసుపత్రి పాలయ్యారు. కాన్పూర్ లోని తన నివాసంలో ఉండగా ఈ మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కాన్పూర్ లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వయో నిబంధన కారణంగా ఇటీవలి ఎన్నికలకు దూరంగా ఉన్న మురళీ మనోహర్ జోషి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

కాగా, జోషి ఆరోగ్య స్థితి పట్ల బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

BJP
Murali Manohar Joshi
  • Loading...

More Telugu News