Polavaram: కేంద్రం మిగతా ప్రాజెక్టుల కంటే పోలవరంకే ఎక్కువ ఖర్చు చేస్తోంది: జీవీఎల్

  • పోలవరం నిర్వాసితులతో జీవీఎల్ సమావేశం
  • నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ
  • ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలపై అధ్యయనం చేయాల్సి ఉందని వెల్లడి

బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పోలవరం నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలపై అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. కేంద్రం మిగతా ప్రాజెక్టుల కంటే పోలవరం ప్రాజెక్టుకే ఎక్కువ ఖర్చు చేస్తోందని వెల్లడించారు. నిర్వాసితులు ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. నిర్వాసితులకు అందాల్సిన ప్రయోజనాలు అందాయా? లేదా? అనేదే తమకు ముఖ్యమని జీవీఎల్ స్పష్టం చేశారు.

Polavaram
GVL
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News