Arun Jaitly: అరుణ్‌ జైట్లీ అంతిమ యాత్ర ప్రారంభం...ప్రత్యేక వాహనంలో యమునా నది తీరానికి

  • ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపు
  • వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు, అభిమానులు
  • నిగంబోధ్‌ ఘాట్‌లో అంతిమ సంస్కారం

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంతిమ యాత్ర ఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. జైట్లీ పార్థివ దేహాన్ని నాయకులు, అభిమానుల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంచారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచి యాత్ర ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌ వరకు యాత్ర కొనసాగుతుంది.

అక్కడ మధ్యాహ్నం 2.30 గంటలకు జైట్లీ మృతదేహానికి అంతిమ సంస్కారాన్ని కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు. కాగా, అంతిమ యాత్రలో పార్టీ అభిమానులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Arun Jaitly
last funeral
yamuna river
rally
  • Loading...

More Telugu News