The King Hamad Order of the Renaissance: ప్రధాని మోదీకి మరో గౌరవం.. ‘కింగ్ హమద్’ అవార్డును బహూకరించిన బహ్రెయిన్!

  • బహ్రెయిన్ రాజుతో మోదీ భేటీ
  • పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
  • అంతరిక్షం, సోలార్, సాంస్కృతిక రంగంలో ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో గౌరవం దక్కింది. నిన్న యూఏఈ ప్రభుత్వం మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయాద్’ను ను అందించగా, ఈరోజు బహ్రెయిన్ సర్కారు ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైసెన్స్’ అవార్డును ప్రకటించింది. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ అవార్డును మోదీకి బహూకరించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపిన మోదీ అంతరిక్ష రంగం, సౌర శక్తి, సాంస్కృతిక రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

ఈ అవార్డును అందుకున్న అనంతరం ప్రధాని స్పందిస్తూ..‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైసెన్స్ అవార్డును నేను వినమ్రంగా స్వీకరిస్తున్నా. భారత్-బహ్రెయిన్ ల మధ్య ఎంత బలమైన స్నేహం ఉందో చెప్పేందుకు ఈ అవార్డే నిదర్శనం. బహ్రెయిన్ తో భారత్ కు వందలాది సంవత్సరాల నుంచే సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఈ సంబంధాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. బహ్రెయిన్ లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

The King Hamad Order of the Renaissance
Narendra Modi
BJP
Prime Minister
CONFERRED
Bahrain
  • Loading...

More Telugu News