MAN VS WILD: ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో నేను హిందీలో మాట్లాడినా బేర్ గ్రిల్స్ ఎలా అర్థం చేసుకోగలిగాడో తెలుసా?: ప్రధాని మోదీ క్లారిటీ

  • మోదీ-గ్రిల్స్ సాహసాలు
  • వీక్షించిన కోట్లాది మంది
  • టెక్నాలజీ దూరాన్ని చెరిపేసిందన్న మోదీ

ప్రధాని మోదీ ఇటీవల మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సాహసికుడు బేర్ గ్రిల్స్ కలిసి నదిని తెప్పపై దాటడం, బల్లెంను తయారు చేయడం వంటి పనులను మోదీ చేశారు. డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ఈ  నెల 12న రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. ఈ సందర్భంగా గ్రిల్స్-మోదీ సంభాషణలో చాలాసార్లు హిందీ పదాలు దొర్లాయి. ఇంగ్లీష్ భాష తప్ప మరో ముక్క తెలియని గ్రిల్స్ మోదీ హిందీలో చెబుతున్న పదాలను ఎలా అర్థం చేసుకున్నాడో? అని చాలామంది ప్రజల్లో అనుమానం నెలకొంది. తాజాగా ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

తామిద్దరి భాషల మధ్య దూరాన్ని టెక్నాలజీ చెరిపేసిందని ప్రధాని తెలిపారు. బేర్ గ్రిల్స్ కు ఓ కార్డ్ లెస్ ట్రాన్స్ లేటర్ పరికరాన్ని ఇచ్చామని మోదీ వెల్లడించారు. దీన్ని గ్రిల్స్ చెవికి అమర్చుకున్నారని చెప్పారు. ఈ పరికరం హిందీలో చెప్పే మాటలను వెంటనే ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తుందని పేర్కొన్నారు. ఇలా తామిద్దరం మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News