online trade: తక్కువ ధరకు సెల్‌ఫోన్‌ వస్తోందని బుక్‌ చేస్తే చేతిగడియారం పంపారు

  • రంగారెడ్డి జిల్లా చిల్పూర్‌ సమీపంలోని చిన్నపెండ్యాలలో ఘటన
  • ప్రకటన చూసి బుక్‌ చేసిన బాధితుడు
  • బాక్స్‌ విప్పి చూశాక కంగుతిన్న వైనం

అతి తక్కువ ధరకే సెల్‌ఫోన్‌ వస్తోందన్న ఆశతో డబ్బు కట్టిన ఆ యువకుడు చేతికి అందిన బాక్స్‌ విప్పి చూశాక షాక్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిల్పూర్‌ సమీపంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన నీలరాజు కొడుకు వారం రోజుల క్రితం పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసి ఆన్‌లైన్‌లో సెల్‌ ఫోన్‌ బుక్‌ చేశాడు. నిన్న కొరియర్‌ నుంచి పార్సిల్‌ రావడంతో విప్పిచూసి షాక్‌ అయ్యాడు. సెల్‌ ఫోన్‌ బుక్‌ చేస్తే చేతి గడియారం వచ్చిందేమిటా అని కంగుతిన్నాడు. వెంటనే పార్సిల్‌ బాయ్‌ని నిలదీయడంతో అతను పొరపాటు జరిగిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

online trade
cellphone booked
ristwatch
  • Loading...

More Telugu News