Arun Jaitly: జైట్లీ నన్నెప్పుడు కలిసినా అడిగే మొదటి ప్రశ్న అదే: అయాజ్ మెమన్

  • జైట్లీ భారత క్రికెట్ శ్రేయోభిలాషి
  • ఎక్కడ కలిసినా తొలుత స్కోరెంతని అడిగేవారు
  • రాజకీయాల్లో ఉన్నా క్రికెట్‌ను మర్చిపోలేదు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సీనియర్ స్పోర్ట్స్ రైటర్, కామెంటేటర్ అయిన అయాజ్ మెమన్.. జైట్లీతో తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదన్నారు. తామెప్పుడైన కలిస్తే ఆయన మొదట ‘స్కోర్ క్యా హై?’ (స్కోరెంత?) అని  అడిగేవారని అయాజ్ తెలిపారు.. అరుణ్ జైట్లీ భారత క్రికెట్ శ్రేయోభిలాషి అని అయాజ్ పేర్కొన్నారు.

Arun Jaitly
ayaz menon
Cricket
  • Loading...

More Telugu News