Anantapur District: పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-428fa1ad6bd0dfcf44026200c4df7f57d2868eb7.jpg)
- అనంతపురం జిల్లాలోని ఫ్యాక్టరీలో ప్రమాదం
- పేలిన బాయిలర్
- ఆరుగురికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలో ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాయిలర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి గాయపడిన వారి తాలూకూ కుటుంబ సభ్యులు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.