Narendra Modi: బహ్రెయిన్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు

  • భారత-బహ్రెయిన్ మధ్య పలు ఒప్పందాలు
  • ఇది తన అదృష్టమన్న మోదీ
  • సాంకేతిక పరిజ్ఞానం, సౌరశక్తి, అంతరిక్ష రంగాల్లో ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్రమోదీ చరిత్ర సృష్టించారు. బహ్రెయిన్ సందర్శించిన తొలి భారత ప్రధానిగా రికార్డులకెక్కారు. బహ్రెయిన్‌ను ఇప్పటి వరకు ఏ భారత ప్రధానీ సందర్శించలేదన్న విషయం తెలిసిందని, తొలిసారి బహ్రెయిన్‌ను సందర్శించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. తన పర్యటన చారిత్రాత్మకమని, ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని మోదీ తెలిపారు.

బహ్రెయిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం, సౌర శక్తి, అంతరిక్ష రంగాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మోదీ, ప్రిన్స్ ఖలీఫాలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
 


Narendra Modi
Bahrain
India
  • Loading...

More Telugu News