Reliance: వెంకన్నకు రూ. 1.11 కోట్లు పంపిన ముఖేశ్ అంబానీ!

  • అన్నదాన పథకానికి వితరణ
  • చెక్ అందించిన రిలయన్స్ ప్రతినిధి ప్రసాద్
  • ప్రసాదాలను అందించిన టీటీడీ

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడంటే ఎవరికి మాత్రం భక్తి ఉండదు?. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఇండియాలోనే అత్యంత కుబేరుడిగా పేరున్న ముఖేష్ అంబానీ కూడా అంతే. ఆయన, ఆయన కుటుంబీకులు తరచూ తిరుమల సందర్శించి, స్వామికి కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. తాజాగా, ముఖేష్ అంబానీ, స్వామివారికి రూ. 1.11 కోట్లను పంపారు. ఈ మొత్తాన్ని సంస్థ ప్రతినిధి ప్రసాద్, స్వయంగా తిరుమలకు వచ్చి అధికారులకు అందించారు.

ఈ నగదును స్వామివారి నిత్యాన్నదాన పథకానికి వినియోగించాలని కోరారు. ఈ మేరకు ముఖేష్ సంతకం చేసిన చెక్ ను అందుకున్న అధికారులు, స్వామివారి ప్రసాదాలను ప్రసాద్ ద్వారా ముఖేష్ కు పంపుతున్నట్టు తెలియజేశారు.

Reliance
TTD
Tirumala
Cheque
  • Loading...

More Telugu News